28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గెస్ట్ లెక్చరర్లందరిని యధావిధిగా కొనసాగించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వానికి గెస్ట్ లెక్చరర్ల విన్నపం

 

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో గత 11 సంవత్సరాలుగా పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్లందరిని యధావిధిగా కొనసాగించాలని తెలంగాణ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ శనివారం ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాష్ట్ర వ్యాప్తంగా గెస్ట్ లెక్చరర్లగా పని చేస్తున్న 1654 మందిని రెన్యూవల్ చెయ్యాలని కొరింది. ఇంటర్ బోర్డు నుండి మొత్తం 1654 మందిని రెన్యూవల్ చెయ్యాలని అందుకు అనుగుణంగా  స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ చేసి జి. ఓ ఇవ్వాలని లెటర్ పెట్టిన ఇప్పటికి క్లియరెన్స్ రాలేదని స్టేట్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. పోస్టులు తగ్గించకుండా యధావిధిగా కొనసాగించాలని పెట్టిన లేటర్ ను ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పక్కన బెట్టి కేవలం 400 మందిని మాత్రమే తీసుకోవాలని అందుకు అనుగుణంగా జి ఓ తయారకి ప్రభుత్వం రెడీ అవుతున్నరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలా జరిగితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1300 కుటుంబాలు రోడ్డున పడతాయాన్ని వారు అంటున్నారు. డైరెక్టర్ రిక్రూట్ మెంట్ లో భాగంగా డిస్టర్బ్ అయిన గెస్ట్ లెక్చరర్లను అడ్జెస్ట్ చెయ్యాలని కమిటీ కోరింది.కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపిన ప్రకారం గెస్ట్ లెక్చరర్లందరిని తిరిగి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను   టీ జి జి జె సీ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ అభ్యర్థించింది.

More articles

Latest article