. . . టీయుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కామ్రేడ్ సంజయ్ మరణం పార్టీకి, మన దేశ విప్లవ కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీవ్ర నష్టమని టీయుసిఐ జిల్లా అధ్యక్షులు ఎం.నరేందర్ అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లీలో కామ్రేడ్ సంజయ్ సింగ్వి ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ సంజయ్ 40 సంవత్సరాలకు పైగా విప్లవ కమ్యూనిస్ట్ ఉద్యమంలో చాలా చురుకుగా ఉన్నారన్నారు. కామ్రేడ్ సంజయ్ సింఘ్వి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ట్రేడ్ యూనియన్ శ్రేణులు కృషి చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో టియుసిఐ కార్యదర్శి ఎం.సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, జిల్లా నాయకులు సాయరెడ్డి, కిరణ్, పీ.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు కే.గణేష్, పీవైల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, టియుసిఐ నాయకులు శివకుమార్, శాంతికుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
