28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఆర్టీసీ జేఏసీతో సర్కార్ చర్చలు సఫలం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ఓకే చెప్పిన ప్రభుత్వం

 

. . . సమ్మె విరమణకు అంగీకారం

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

గత మూడు రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె విరమణకు జే ఎసి నాయకులు అంగీకరించారు. ఆర్టీసీ జేఏసీ నాయకులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి తో జేఏసీ నాయకులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన చర్చలు కొలిక్కి రావడంతో ఆర్టీసీ నాయకుల డిమాండ్లకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మె విరమణకు అంగీకారం కుదిరింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి నిర్దిష్ట టైం, బౌండ్ డెడ్ లైన్ పెట్టుకుని పూర్తి చేయడానికి మంత్రుల గ్రూప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఈ ప్రక్రియపై అధికారులు అన్ని వివరాలను అధ్యయనం చేశారు. కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని ఆర్టీసీ యాజమాన్యంతో చర్చించుకుని ఫైనల్ చేసుకోవాలని ప్రభుత్వం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆర్టీసీ కార్మికులకు బకాయి ఉన్న 2021,2025 పీఆర్ సీ ఫిట్ మెంట్ ను చెల్లించడానికి కూడా ప్రభుత్వం స్పష్టమైన హామి ఇచ్చింది. దీంతో కార్మిక సంఘాలు సమ్మెను విరమించడానికి అంగీకరించాయి. మరి కొద్దిసేపట్లో ప్రభుత్వం నుంచి, కార్మిక సంఘాల జేఏసీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడనుంది. డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో జరిగిన చర్చల్లో పై నిర్ణయాలు జరిగాయి. ప్రైవేటు బస్సులు, అద్దె బస్సులు, ఈవీ బస్సులు వచ్చినా ఉద్యోగాలు పోవని ప్రభుత్వం ఈ సమావేశంలో హామీ ఇచ్చింది. కార్మికులందరికి ఉద్యోగ భద్రత ఉంటుందనే భరోసా లభించింది. గత ప్రభుత్వంలో సమ్మె చేసిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కనీసం ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి, వారి సంక్షేమం ఊసే ఎత్తలేదని, చర్చలకు పిలవనే లేదనే అంశాన్ని సైతం జేఏసీ ప్రతినిధులు గుర్తు చేసుకున్నారు. కానీ ప్రస్తుతం సమ్మే రెండో రోజునే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని స్వచ్ఛందంగా పిలుపు ఇచ్చారని, దానికి కొనసాగింపుగా అధికారుల కమిటీకి, డిప్యూటికి సీఎం నాయకత్వంలోని మంత్రుల టీం కి ఆదేశాలు ఇచ్చారని, ఆ ప్రకారమే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయన్న అంశం సైతం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వానికి స్పష్టమైన అభిప్రాయమే ఉన్నదని, ఆ సంస్థను కాపాడుకోవాలన్న తపనతోనే మహాలక్ష్మి స్కీమ్ తో ఆదాయం పడిపోతున్నా ప్రభుత్వం రీ ఇంబర్స్ చేసి కాపాడుతున్నదనే అంశం పైనా ప్రతి నిధులు రియలైజ్ అయ్యారు. గతంలో జీతం ఎప్పుడొస్తుందో తెలియని అనిశ్చితి కొనసాగితే ఇప్పడు ప్రతి నెలా ఠంచన్ గా తేదీనే వస్తున్నదని, ఒక డీఏ కూడా పెండింగ్ లో లేకుండా క్లియర్ అయ్యాయన్న అంశం పైనా ప్రతి నిధులు సంత్రప్తి వ్యక్తం చేశారు. పీట ముడిగా ఉన్న మూడు ప్రధాన డిమాండ్లలో యూనియన్లకు ఎన్నికలు నిర్వహించడం కొలిక్కి వచ్చింది. పీఆర్ సీ బకాయిల విషయంలోనూ ఒక షెడ్యూలు ఫిక్స్ చేసి ఆ ప్రకారం విడతల వారీగా విడుదల చేయడంపై ఏకాభిప్రాయం కుదిరింది. ప్రభుత్వంలో విలీనం చేసే అంశం గురించి మరిన్ని దఫాలుగా చర్చలు జరిగిన తర్వాత లీగల్ అంశాలను పరి గణనలోకి ప్రభుత్వం ఒక స్పష్టతకు వస్తుందనే అంశం డిప్యూటీ సీఎం టీం తో జరిగిన చర్చల సందర్భంగా కొలిక్కి వచ్చినట్టు తెలిసింది.

More articles

Latest article