30.2 C
Hyderabad

సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,  జుక్కల్: టీఎస్ఎస్యూఎస్ జుక్కల్ మండల శాఖ ఆధ్వర్యంలో  సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలని,  తక్షణమే పే స్కెల్ అమలు చెయ్యాలని ఎంఆర్సీ ఎంఈఓ కార్యాలయం ఎదుట శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.  ఈ సందర్బంగా జుక్కల్ మండల సమగ్ర ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.  గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మే చేస్తున్న సందర్భంలో హన్మకొండ లోని సమ్మే శిబిరానికి అప్పటి టీపీపీసీ అధ్యక్షులు, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మద్దతు తెలుపుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, పే స్కెల్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావొస్తున్న ఇప్పటి వరకు హామీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  వెంటనే ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే డిసెంబర్ మొదటి వారంలో సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె కు వెళ్తారని అన్నారు.ఈ కార్యక్రమం లో  జుక్కల్ మండలం సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

More articles

Latest article