25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆహార కల్తీపై వినియోగదారులకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఆహార కల్తీపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రుద్రూర్ మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన కేంద్రం లో శనివారం రైతులు, ఫుడ్ టెక్నాలజీ విద్యార్థులకు చైతన్య కార్యక్రమాలు, నిజామాబాద్ నగరంలో వివిధ రకాల పాల నాణ్యతపై టెస్ట్ పర్చేజ్ లపై అవగాహన కల్పించారు. వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, సిసీఐ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి చర్ల సుదర్శన్, గౌరవ అతిథిలుగా సైంటిస్ట్ అంజయ్య, అసోసియేట్ డీన్ డా.కల్పనలు హాజరయ్యారు.

Consumer awareness on food adulteration

ఆహార కల్తీ పట్ల వినియోగదారులు చైతన్య వంతులు కావడంతో పాటు, ఆహార కల్తీ బాధితులకు తగిన నష్టపరిహారం పొందడానికి వినియోగదారుల రక్షణ చట్టం 2019 ద్వారా నే సాధ్యమవుతుందని సాంబరాజు చక్రపాణి తెలిపారు. రైతు పంటల స్థాయిలో ఆహార కల్తీ నివారణకు కృషి విజ్ఞాన కేంద్రం శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సైంటిస్ట్ అంజయ్య తెలిపారు. ఆహార పదార్థాలలో కల్తీ ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిల్వ ల స్థాయిల్లో ఎక్కువగా ఉంటున్నదని, కాబట్టి విద్యార్థి స్థాయిల్లో నే ఫుడ్ టెక్నాలజీ ద్వారా విద్యార్థులను చైతన్య వంతులను చేస్తున్నట్లు డా.కల్పన తెలిపారు. అనంతరం నిజామాబాద్ లో అమ్మకం జరుగుతున్న వివిధ రకాల పాలు, వినియోగదారులు ఉపయోగించే  రెండు లేదా మూడు రోజుల ముందు గానే ప్యాకింగ్ జరుగుతున్నదని, పాలు మూడు రోజుల నిల్వ కొరకు హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి రసాయనాలు కలిపే అవకాశాలు దృవ పడుతున్నాయని ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి కార్యావర్గం తెలిపింది. ఇందూర్ కమిటీ అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు వి యస్ వర్మ, ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్, సంయుక్త కార్యదర్శులు గైని రత్నాకర్, మహాదేవుని శ్రీనివాస్, యాటకర్ల దేవేశ్ తదితరులు పాల్గొన్నారు.

Consumer awareness on food adulteration

More articles

Latest article