సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
బతుకమ్మ, జుక్కల్: టీఎస్ఎస్యూఎస్ జుక్కల్ మండల శాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిక్షా ఉద్యోగులను రెగ్యులర్ చెయ్యాలని, తక్షణమే పే స్కెల్ అమలు చెయ్యాలని ఎంఆర్సీ ఎంఈఓ కార్యాలయం ఎదుట శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా జుక్కల్ మండల సమగ్ర ఉద్యోగులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మే చేస్తున్న సందర్భంలో హన్మకొండ లోని సమ్మే శిబిరానికి అప్పటి టీపీపీసీ అధ్యక్షులు, నేటి ముఖ్యమంత్రి రేవంత్...