24.8 C
Hyderabad
Friday, July 31, 2026

అడ్మిషన్ అయిన ప్రతి విద్యార్థి యు డైస్ పూర్తి చేయండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ప్రభుత్వ జూనియర్ కళాశాలల లో చేరిన ప్రతి విద్యార్థి, విద్యార్ధినుల వివరాలను యు డైస్ ద్వారా కంప్యూటర్లలో నిక్షిప్తం చేయాలని జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవి కుమార్ ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. బుధవారం జిల్లా ఇంటర్ విద్య అధికారి కార్యాలయంలో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపల్ ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్మిషన్లను మరిన్ని పెంచేందుకు ప్రిన్సిపల్ లు,  అధ్యాపకులు కృషి చేయాలని ఆదేశించారు. 10వ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థి ప్రభుత్వ కళాశాలలో చేరేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామానికి అధ్యాపకులు వెళ్ళి అడ్మిషన్ లను పెంచాలని ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ వెంటనే పూర్తి చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ లను ఆదేశించారు. ఇంకా అవసరమైతే పాఠ్యపుస్తకాలను తెప్పించేందుకు ఇంటర్ బోర్డు ద్వారా ప్రయత్నం చేస్తామని ఇంకా అవసరమైన కళాశాలల ప్రిన్సిపాల్ లు వెంటనే ఇండెంట్ పంపాలని అన్నారు. అలాగే కళాశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, విద్యార్థిని విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రిన్సిపాల్ లు కృషి చేయాలని ఆదేశించారు. ప్రిన్సిపల్ తో సహా అధ్యాపకులందరూ సమయపాలన పాటించాలని, విద్యార్థినీ విద్యార్థులు కూడా సమయానికి కళాశాలకు రప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్ అధికారి అన్నారు. అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులు ఉండేలా ఇంటర్ బోర్డు తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఎక్కడైతే అధ్యాపకుల కొరత ఉందో వెంటనే వివరాలు పంపితే గెస్ట్ లెక్చర్లను నియమించెందుకు కృషి జరుగుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా లోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.

More articles

Latest article