31 C
Hyderabad

ఆటో డ్రైవర్ అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజాంసాగర్, బతుకమ్మ : ఈనెల 15న భూమవ్వ అనే మహిళకు మాయ మాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దోచుకున్న ఆటో డ్రైవర్, ఒక మహిళను సోమవారం అరెస్ట్ చేసినట్లు బాన్సువాడ రూరల్ సీఐ టి.రాజేష్ తెలిపారు. తన సిబ్బందితో బొగ్గు గుడిసె ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఆటో అక్కడి నుండి పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని విచారించారు. అందులో ఉన్న పోలో జాక్సన్ సుందర్ రాజు, వడ్డే లక్ష్మి లు  తామే ఆ నేరం చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి వెండి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారినీ అదుపులోకి తీసుకుని ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు.  ఈ కేసు చేదనలో ప్రతిభ కనబరిచిన నిజాంసాగర్ ఎస్సై, శ్యామ్, మహేష్ లను బాన్సువాడ రూరల్ సీఐ అభినందించారు.

More articles

Latest article