27 C
Hyderabad

ఫామ్‌హౌస్‌లో కలకలం . . .

Commotion at the farmhouse . . .

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రిటైర్డ్‌ ఎస్‌ఐ కుమారుడు అనుమానాస్పద మృతి

 

మేడ్చల్, బతుకమ్మ :

 

మేడ్చల్‌ మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్ పరిధిలోని ఏదులాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన రిటైర్డ్ ఎస్‌ఐ కుమారుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. ఉప్పల్ భగాయత్‌కు చెందిన రిటైర్డ్ ఎస్‌ఐ సి. ప్రవీణ్ కుమార్ కుమారుడు కృష్ణ కౌండిన్య (21) బీటెక్ పూర్తి చేశాడు. తన స్నేహితుడు ఘన్‌కోట్ రిషబ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు కృష్ణ కౌండిన్య ఏదులాబాద్‌లోని లివిన్ ఫామ్‌హౌస్‌కు వెళ్లాడు. అయితే పార్టీ జరుగుతున్న సమయంలో కృష్ణ కౌండిన్య ఫామ్‌హౌస్‌లో అపస్మారక స్థితిలో పడిపోయాడని రిషబ్ తండ్రి రిటైర్డ్ ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తన కుమారుడి మృతిపై పలు అనుమానాలున్నాయని తండ్రి ప్రవీణ్ కుమార్ ఘట్‌కేసర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అసలు పుట్టినరోజు వేడుకల్లో ఏం జరిగింది? మృతికి గల అసలు కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. యువకుడి అకస్మాత్ మరణంతో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

More articles

Latest article