24 C
Hyderabad
Sunday, August 2, 2026

పీసీసీ చీఫ్ కు కల్లుబట్టీల్లో కమీషన్లు

Must read

📰 Generate e-Paper Clip

. కాంగ్రెస్ నాయకులు వసూళ్లకు తెగబడుతున్నారు

. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపణ

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాలోని కల్లు బట్టీల నుంచి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కమీషన్లు తీసుకోవడం ప్రారంభించారని, కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ వసూళ్లకు తెగబడ్డారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రేపు జిల్లాలో 5వేల మందితో దీక్షా దివస్ నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ది ప్రజా పాలన కాదని, సీఎం రేవంత్ రెడ్డి ఫస్ర్టేషన్ పాలన అని, ఆయన పులికేశిలా వ్యహరిస్తున్నారన్నారు. రైతుల అక్రమ అరెస్టులు, బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు.. ఇదే ప్రజాపాలననా అని ప్రశ్నించారు. కాగ్రెస్ హయాంలో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తంచ శారు. కాంగ్రెస్ కువత్తాసు పలుకుతున్న అధికారుల పేర్లు పింక్ బుక్ లో ఎక్కిస్తున్నామని, తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, సీనియర్ నాయకుడు రాంకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article