29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

వస్తుంది 56,914.. పోతుంది 56,914..

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి 56,914 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. వరద కాలువ ద్వారా 19 వేల క్యూసెక్కులు లక్ష్మీకాల్వ ద్వారా 108 ప్రధాన గేట్ల ద్వారా 28,865 క్యూసెక్కుల నీటిని, మిషన్ భగీరథ కోసం 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
36. 29 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి..
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కాలువ అయినటువంటి కాకతీయ కాలువ ద్వారా 6800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో స్థానికంగా ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నాలుగు టర్బైన్ల ద్వారా 36.29 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని జెన్ కో డీఈఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 20.844 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు.

More articles

Latest article