తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల

0 2,686

. ఏర్పాటుకు సీఎం సుముఖంగా ఉన్నారు

. ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్

నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించారని, ఈ మేరకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సీఎంకు నివేదించారని ఎన్ ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ యూనివర్సిటీకి ఇంజినీరింగ్ కళాశాల తో పాటు వర్సిటీ అభివృద్ధికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భూపతిరెడ్డికి సీఎం మాటిచ్చారన్నారు. అలాగే మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్  యూనివర్సిటీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో యూనివర్సిటీ వ్యవహారాలు ఆగమయ్యాయని, వీసీలు విశ్వ విద్యాలయ ప్రతిష్టను బజారుకీడ్చారని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీపరుడైన వ్యక్తిని వీసీగా నియమించిందని, ఆయన విశ్వవిద్యాలయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని, అలాగే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు విశ్వవిద్యాలయ అభివృద్ధిపై ఆందోళన చెందొద్దని ఆయన కోరారు.  సమావేశంలో ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు నిఖిల్ రెడ్డి , శివ, నరందీప్ చింటు, హరీశ్, శ్రవణ్, సృజన్, ధనుష్, ప్రదీప్ చింటు, రేవంత్ యాదవ్, మదన్ యాదవ్, విష్ణు, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.