- అదనపు తరగతి గదుల కోసం ఎన్నేండ్లు ఈ నిరీక్షణ..?
- ఒకే గదిలో ఐదు తరగతులు
- పలుమార్లు సమస్యను విన్నవించినప్పటికీ ఫలితం శూన్యం
ఇంధల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల పరిధిలో గల గంగారాం తండాలోని మండల ప్రాథమిక పాఠశాలలో ఓకే గధి లో ఐదు తరగతులు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థులు తేలిపారు. గతంలో పై ఉన్నతాధికారుల దృష్టికి,అలాగే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు పట్టించుకున్న వారే కరువయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాగైతే తమ పిల్లల భవిష్యత్ ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో అదనపు గదులు,ప్రహరీ గోడ నిర్మాణం కొరకు పలుమార్లు విన్నవించడం జరిగిందన్నారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడం వల్ల కొందరు యువకులు మద్యం సేవించి పాఠశాల ఆవరణలో తాగిన బాటిల్లను వదిలేస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకున్న సమస్యలు నూతన అదనపు గదులు,ప్రవరిగోడ నిర్మించే విధంగా కృషి చేయాలని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గంగారం తండా పాఠశాల పైన ప్రత్యేక శ్రద్ధ చూపి అదనపు గదులు,ప్రహరీ గోడ మంజూరు చేయించి నిర్మించే విధంగా చూడాలని వారు ఈ సందర్భంగా కోరారు.
