25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం బోధన్ పట్టణంలోని విజయ మేరీ హైస్కూల్ లో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం బోధన్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కోసం విజయ మేరీ పాఠశాలలో అనువుగా ఉన్న ఆయా విభాగాల గదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను పరిశీలన జరిపారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ ఇతర అధికారులతో డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సాఫీగా జరిగేలా, అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిపోలింగ్ కు ఆస్కారం ఉండకూడదని అన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ విఠల్, సంబంధిత అధికారులు ఉన్నారు.

 

 

Collector inspects distribution center
Collector inspects distribution center

More articles

Latest article