డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం బోధన్ పట్టణంలోని విజయ మేరీ హైస్కూల్ లో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం బోధన్ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కోసం విజయ మేరీ పాఠశాలలో అనువుగా ఉన్న ఆయా విభాగాల గదులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను పరిశీలన జరిపారు. సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్...