26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఇల్లు మంజూరైన వారందరు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెయింటర్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ శనివారం సాయంత్రం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన జరిపారు. గకాలనీలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ ఆరా తీశారు. లబ్ధిదారులు సత్వరమే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. అర్హులైన వారిని లబ్ధిదారులు గుర్తిస్తూ, ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు. వివిధ కారణాల వల్ల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేకపోయిన లబ్దిదారులను కలిసి, వారికి ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే ఆర్ధిక తోడ్పాటు గురించి వివరిస్తూ అవగాహన కల్పించాలన్నారు. నిర్దేశిత గడువు లోపు నిర్మాణాలు పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని, నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు జరిగేలా అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టి బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి చేసుకున్న లబ్ధిదారులు అజీజా బేగం, సమ్రిన్ సుల్తానా లను కలెక్టర్ పలుకరించి, ఇంటి నిర్మాణానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకోవాలని, వివిధ దశలను అనుసరిస్తూ వెంటదివెంట డబ్బులను ఖాతాలో జమ చేయిస్తామని అన్నారు. అనంతరం కలెక్టర్ దుబ్బ అభయహస్తం కాలనీని సందర్శించి ప్రభుత్వ అసైన్డ్ భూములను పరిశీలించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, హౌసింగ్ అధికారి నివర్తి, మున్సిపల్ టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article