ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. ఇల్లు మంజూరైన వారందరు వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన తోడ్పాటును అందించాలన్నారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పెయింటర్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను...