29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కాటేపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో  శనివారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి  సీఎంఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాటేపల్లి గ్రామానికి చెందిన అరవింద్ కు 36వేలు రూపాయలు,కాటేపల్లి తండా కు చెందిన బామన్ చోద బాయికి 12వేలు రూపాయలు చెక్కును అందజేసినట్లు ఆయన తెలిపారు.నిరుపేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత అండగా ఉందని తెలిపారు.నిరుపేద రోగులకు సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి పథకాలతో ఆర్థికంగా ఆదుకుంటున్నారని తెలిపారు.నియోజకవర్గంలో అనారోగ్యబారిన పడిన వారిపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావ్ ప్రత్యేక శ్రద్ధవహించి ఆదుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీనాయకులు చిప్ప మోహన్ , మల్లప్ప పటేల్, మొహిద్దిన్ పటేల్, మొగులా గౌడ్, పర్వయ్య,గంగా గౌడ్,ఇస్మాయిల్ పటేల్,శంకర్, యూసుఫ్ పటేల్,రామ్ చందర్,సంగయ్య,హాజీ,పాండు, బార్త్యా నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article