రుద్రూర్, బతుకమ్మ : అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని యోగ భవనంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేశారు. యోగతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అనంతరం యోగ గురువులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగ బృందం విశ్వనాథ్ మహాజన్, కేవి మోహన్, సాయిలు, నూత్ పల్లి బాలరాజు, బీజేపీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ బర్ ప్రశాంత్ గౌడ్, మండల కోశాధికారి కిటిక రామరాజు, మండల సెక్రెటరీ గాండ్ల శివకుమార్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు బేగరి శివకుమార్, మండల ఉపాధ్యక్షులు బేగరి వినోద్ కుమార్, బూత్ అధ్యక్షులు పందిరి శివకుమార్, మండల, జిల్లా సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
