21.8 C
Hyderabad

యాప్ వేదింపులకు కానిస్టేబుల్ బలి

Constable falls victim to app-based harassment

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

ఆన్ లైన్ రుణ యాప్ నిర్వాహకుల వేదింపులతో కానిస్టేబులో ఆత్మహత్యకు పాల్పడ్డారు. యాప్ నిర్వాహకుల నుంచి ఎదురైన తీవ్ర వేదింపులు, బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటన పోలీసు వర్గాలతో పాటు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కానిస్టేబుల్ శ్రీను నాలుగు నెలల క్రితం అత్యవసర అవసరాల నిమిత్తం ఓ ఆన్ లైన్ యాప్ ద్వారా రూ.40 వేల రుణం తీసుకున్నాడు. అయితే తీసుకున్న రుణాన్ని నిర్ణీత గడువులోగా చెల్లించకపోవవడంతో యాప్ నిర్వాహకుల నుంచి వేదింపులు ప్రారంభమైనట్లు తెలిసింది. శ్రీనుకు పదే పదే ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చి రుణం చెల్లించాలంటూ యాప్ నిర్వాహకులు వేదించినట్లు తెలిపారు. అంతటితో ఆగకుండా వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. యాప్ నిర్వాహకుల నుంచి కొనసాగుతున్న వేదింపులు, కుటుంబ పరువు తీస్తామన్న బెదిరింపులతో తీవ్ర ఒత్తిడికి గురైన శ్రీను  ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఆన్ లైన్ రుణ యాప్ నిర్వాహకులు ఎవరు? బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులు ఎవరు? వారి కార్యకలాపాలు ఎక్కడ నుంచి కొనసాగుతున్నాయి? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

More articles

Latest article