సీఎం  రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్..

0 1,134

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో..

రక్షణ విభాగాలకు వ్యూహాత్మక కేంద్రంగా హైదరాబాద్..

హైదరాబాద్, బతుకమ్మ : ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం  రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించనున్నారు.  కమాండ్ కంట్రోల్ సెంటర్ కు సీఎంతో పాటు సీఎస్, డీజీపీ, సీపీ, పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు.  ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.  సాయంత్రం జరిగే మాక్ డ్రిల్ ను సీఎం స్వయంగా పర్యవేక్షించనున్నారు. హైదరాబాద్ రక్షణ విభాగాలకు వ్యూహాత్మక కేంద్రంగా ఉండటంతో స్థానికంగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.