26.2 C
Hyderabad

మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం

Must read

📰 Generate e-Paper Clip

మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బ్యాంకు ప్రారంభం

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలకు త్వరలో ఏడాదికి నాణ్యమైన రెండు చీరలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజా ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామన్నారు. నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బ్యాంకును సీఎం ప్రారంభించారు. గత ప్రభుత్వం మహిళలను పట్టించుకోలేదన్నారు. తాము మహిళా సంఘాలను బలోపేతం చేశామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను  చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.

More articles

Latest article