దక్కన్ సర్కార్ పోస్టర్ ను ఆవిష్కరించిన లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ
నిజామాబాద్, బతుకమ్మ: సినిమా అనేది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ అన్నారు. బుధవారం కళా ఆర్ట్స్ బ్యానర్ లో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన కళా శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న చిత్రం దక్కన్ సర్కార్ పోస్టర్ ని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ చేతుల మీదుగా సోమాజిగూడ లోని ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. సినిమా అనేది సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని, ఎన్ని కోట్లు పెట్టి తీసామనేది ముఖ్యం కాదని అన్నారు. హీరోలు ఉంటేనే సినిమా కాదు, సినిమా అనేది ఎప్పుడు సామాజిక కోణాన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలని అన్నారు.ఈ సినిమా టీజర్ చూస్తుంటే నాకు అలానే అనిపిస్తుందని అన్నారు. ఈ సినిమా ను నిర్మించిన కళ శ్రీనివాస్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఎన్నో కోట్లు పెట్టి సినిమాలు తీయడం కాదని, కోట్లు లేకున్నా కంటెంట్ ఉంటే అది ప్రజలకు కనెక్ట్ అవుతుందని ఇందుకు దక్కన్ సర్కార్ సినిమా ని చెప్పవచ్చని అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత,దర్శకుడు కళా శ్రీనివాస్ ని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు మల్లిక్ ఏం వి కే, కళా శ్రీనివాస్ ఈ చిత్ర హీరో చాణక్య, సామాజికవేత్త రంగనాయకుల సంతోష్ బాబు పాల్గొన్నారు.
