రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో గ్రామ సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ సోమవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు, ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడిఓ బాల గంగాధర్, ఎపిఓ అరవింద్, పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ దాస్, వార్డు మెంబర్లు అమంద్ వెంకటేశ్వర్, రవి, వడ్ల నరేష్, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.
