పిట్లం, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా పిట్లం వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ఎంపిక చేస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నిజాం సాగర్ మండలంకు చెందిన చికోటి మనోజ్ కుమార్, వైస్ చైర్మన్ గా మారెడ్డి క్రిష్ణా రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్, వైస్ చైర్మన్ లతో పాటు 16 మంది సభ్యులతో నూతన పాలకమండలిని నియమించిన సందర్బంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నూతన పాలకవర్గానికి నియమాక పత్రాన్ని అందించి, అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
