24 C
Hyderabad
Sunday, August 2, 2026

చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల : మండల కేంద్రములో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యములో తెలంగాణ ఉద్యమకారుణి వీర వనిత చిట్యాల చాకలి ఐలమ్మ130 వ జయంతిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బస్టాండ్ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భూపోరాటానికి నాంది పలికిన వీర మాత అని అలాగే సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ ధైర్యశాలి అని గుర్తు చేసుకొన్నారు.చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.వీరనారి ఐలమ్మకి జై అంటూ నినాదాలు చేస్తూ ఘనముగా నివాళ్లు అర్పించారు.ఇట్టి కార్యక్రమములో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, గడ్డం జీవన్ రెడ్డి, మూస్కు మోహన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి, మేకల సాయన్న, పన్నాల నర్సారెడ్డి, బద్దం జితేందర్ రెడ్డి, రజక సంఘం కమ్యూనిటీ  పెద్ద మనుషులు, సంఘాల సభ్యులు,ఏర్గట్ల పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలందరూ అత్యధికంగా పాల్గొన్నారు.

More articles

Latest article