25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ గ్రామంలోని రజక సంఘం భవనంలో శుక్రవారం రజక కులస్తులు చాకలి ఐలమ్మ  130 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు కొత్తింటి నాగభూషణం, శేఖర్, బీఆర్ఎస్ నాయకులు,  రజక సంఘం కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article