28.8 C
Hyderabad

మామునూరు ఎయిర్ పోర్ట్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్

Must read

📰 Generate e-Paper Clip

వరంగల్, బతుకమ్మ:

వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మామునూరు ఎయిర్ పోర్ట్ కు అనుమతి ని మంజూరీ చేస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి  అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కు లేఖ ద్వారా తెలియజేశారు. మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (Airport Authority of India) అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి పలుదఫలుగా చర్చలు జరిపి ప్రాజెక్టు పట్టా లెక్కించడం లో చొరవ చూపడంతోనే ఇవ్వాల అన్ని అనుమతులు మంజూరు అయ్యాయని  చెప్పాలి

గత పదేండ్లుగా పెండింగ్ లో ఉన్న ఎన్ఓసి అడ్డంకిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జీఎంఆర్ సంస్థ యాజమాన్యం తో సంప్రదింపులు జరిపి, బోర్డులో పెట్టి  ఎన్ ఓసి వచ్చేలా చేశారు. దీంతో HAIL తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి  అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ NOC ఇచ్చారు. ఇప్పుడు ఈ NOC ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది.  ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి  అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కు లేఖ ద్వారా తెలిపారు.

More articles

Latest article