24.7 C
Hyderabad
Monday, August 3, 2026

 తేయూలో సివి రామన్ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ లో శుక్రవారం  సివి రామన్ జన్మదిన వేడుకలు ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ  శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించవలసింది మానవ కల్యాణానికే కానీ మారణ హోమానికి కాదని సివి రామన్ తెలిపారని కొనియాడారు. విశ్వవిద్యాలయాలు లోతైన శాస్త్రీయ పరిశోధన నిర్వహించి  సమాజానికి దిక్సూచిగా  పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమానికి పరీక్షల నియంత్రణ అధికారి కే సంపత్ కుమార్,వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ,పి ఆర్ ఓ ( డైరెక్టర్) ఏ పున్నయ్య, సైన్స్ డీన్  ఆచార్య  సిహెచ్ ఆరతి, డాక్టర్ నాగరాజు  డాక్టర్ ప్రసన్న శీల, డాక్టర్ నీలిమ,డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article