29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని జీకే తండా గ్రామపంచాయతీ పరిధిలో రూ.15 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్ శిరీష మైపాల్ నాయక్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయని ఆమె పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఈ రోడ్ల నిర్మాణం దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో జీకే తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, గ్రామాన్ని శాతం శాతం అభివృద్ధి చెందిన గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేఘవాత్ రజిత సుధీర్, వార్డు సభ్యులు భూక్య మోహన్, బదావత్ మైపాల్ నాయక్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article