28.8 C
Hyderabad
Monday, August 3, 2026

భారత్ ను విశ్వ గురువుగా నిలబట్టడమే ఆయన సంకల్పం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

భారత్ ను విశ్వ గురువుగా నిలబట్టడమే ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమని, అందుకు ఆయన అహర్నిశలు పాటు పడుతున్నారని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా పని చేసిన రికార్డు మోదీ సొంతం అని, దేశంలో అత్యధిక ప్రజాదరణ ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నే అని అన్నారు. ఆయన నాయకత్వంలో అత్యధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, అదే విధంగా తెలంగాణ లో కూడా అధికారంలోకి వస్తుందనీ ఆశాభావం వ్యక్తం చేశారు.

More articles

Latest article