సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండలంలోని జీకే తండా గ్రామపంచాయతీ పరిధిలో రూ.15 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్ల నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించినట్లు గ్రామ సర్పంచ్ శిరీష మైపాల్ నాయక్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయని ఆమె పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ఈ రోడ్ల నిర్మాణం దోహదపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సహకారంతో జీకే తండాను అన్ని రంగాల్లో...