24.6 C
Hyderabad

పేకాట స్థావరం పై సీసీఎస్ టీం మెరుపు దాడి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలో పేకాట స్థావరంపై సీసీఎస్ టీం మెరుపు దాడి చేశారు. నగర పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏ.సీ.పీ ఇంచార్జ్ మస్తాన్ ఆలి సూచనల మేరకు ఎస్సై గోవింద్, వారి సిబ్బంది కలిసి శుక్రవారం సాయంత్రం నిజామాబాదు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగస్థాన్ ఫేజ్ 1 లో గల సాయి రుద్వి అపార్ట్మెంట్ లో పేకాట స్థావరం పై రైడ్ చేశారు. జూదం ఆడుతున్న 7 గురు పేకాట రాయుళ్ళును, 7 సెల్ ఫోన్స్, రూ. 22,060/- స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం నిజామాబాదు రూరల్ పోలీస్ స్టేషన్  ఎస్ హెచ్ వోకి అప్పగించారు.

More articles

Latest article