27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మహారాష్ట్ర ఫలితాలు ఇందూర్ లో పునరావృతం ఖాయం

Must read

📰 Generate e-Paper Clip

. . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

మహారాష్ట్రలో శుక్రవారం వెలువడిన మున్సిపల్ ఫలితాలు బీజేపీ అఖండ విజయం సాధించడంతో కమలం పార్టీ నాయకులు సంబురాలు నిర్వహించుకున్నారు. నగరంలోని గాంధీచౌక్ లో పటాకులు కాల్చి గులాలు చల్లుకుని స్వీట్లు పంచుకుని సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ మహారాష్ట్ర లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి పార్టీతో కలిసిన మహాయుతి పార్టీ 29 కార్పొరేషన్ స్థానాలకు గాను 26 కార్పొరేషన్ స్థానాలు సాధించి బిజెపి పార్టీ అఖండ విజయం సాధించిందని తెలిపారు. ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదని, రాష్ట్రంలో కూడా త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఇవే ఫలితాలు పునరావృతం కానున్నాయని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై ఒట్టేసి గద్దెనెక్కిన తర్వాత హిందూ దేవతలపై అవహేళనగా మాట్లాడడాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని రాబోయే కొద్ది రోజుల్లోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముఖ్యంగా ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ పై బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన అన్నారు. మహారాష్ట్రలో కూడా మొదటగా హిందూ దేవతల పైన ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడిన శివసేన పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రస్తుతం ఆ పార్టీకి మహారాష్ట్రలో అడ్రస్ లేకుండా పోయిందని ఆయన విమర్శించారు.

 

Maharashtra results likely to be repeated in Indore
Maharashtra results likely to be repeated in Indore

More articles

Latest article