24 C
Hyderabad
Sunday, August 2, 2026

నగరంలో పేకాట స్థావరంపై సీసీఎస్ దాడి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నగరంలోని 4వ టౌన్ పరిధిలోని తిరుమల టాకీస్ ప్రాంతంలో పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ ఇంచార్జ్ మస్తాన్ ఆలీ సూచనల మేరకు  సిఐ డి.సాయినాథ్, ఎస్సై  గోవింద్ సిబ్బందితో కలిసి నగరంలోని తిరుమల టాకీస్ రోడ్డు దగ్గరలో ఉన్న ఒక గదిలో  పేకాట స్థావరం పై దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు పేకాట రాయుళ్ళు ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.10,350నగదు, 4 సెల్ ఫోన్స్ లను స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం 4వ టౌన్ ఎస్ హెచ్ వోకి  అప్పగించారు.

More articles

Latest article