. . .పోలీసులపై దాడికి యత్నించిన పాత నేరస్తుడు
వెబ్ డెస్క్, బతుకమ్మ:
తనను పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై దాడికి తెగబడ్డారు మోస్ట్ వాంటెడ్ దొంగ. పోలీసులపై కత్తితో రాడ్ తో దాడి చేసేందుకు యత్నించగా ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో గాయపడి చిక్కాడు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని ఓఆర్ఆర్( ఔటర్ రింగ్ రోడ్డు) లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భూమి శ్రీకాంత్ ఉన్నాడని నల్గొండ సిసిఎస్ పోలీసులు సమాచారం అందింది. భూమి శ్రీకాంత్ పై నల్గోండతో పాటు తెలంగాణలో 10 కి పైగా దోంగతనాల కేసులో, ఎపిలో కానిస్టేబుల్ దారుణ హత్య కేసులో నిందితుడు. నల్గోండ జిల్లాలో ఇటీవల వరుస చోరీలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న శ్రీకాంత్ కోసం నల్గోండ పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పెట్- ఆదిబట్ల సమీపంలో శ్రీకాంత్ ఉన్నట్లు గుర్తించిన సిసిఎస్ పోలీసులు పట్టుకునేందుకు యత్నించగా అతను కత్తితో , రాడ్ తో పోలీసులపై దాడిచేసి పరారీ అయ్యేందుకు యత్నించాడు. పోలీసులు తుపాకితో శ్రీకాంత్ కాళ్లపై కాల్పులు జరపడంతో గాయపడి చిక్కాడు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది…

