25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మద్నూర్  లో నిలిచిపోయిన సీసీఐ పత్తి కొనుగోలు..!

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మద్నూర్:  రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా సిసిఐ నిబంధనలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలుదారులు సోమవారం పత్తి కొనుగోళ్ళను నిలిపివేయడంతో మద్నూర్ మార్కెట్ పరిధిలో సీసీఐ ఎల్ 01, ఎల్ 02, ఎల్ 03, మిల్లులకు కఠిన నిబంధనల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ కాటన్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో పత్తి వ్యాపారులు సిసిఐ కొనుగోలు ప్రైవేట్ కొనుగోళ్ళను నిరవధికంగా నిలిపివేశారు. దీనితో మద్నూర్ మార్కెట్ కు అమ్మటానికి వచ్చిన పత్తి వాహన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా తెలంగాణ కాటన్ అసోసియేషన్ యూనియన్ నాయకులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి సఫలం కావడంతో, పత్తి కొనుగోలు మార్కెట్ పరిధిలో మధ్యాహ్నం ప్రారంభించారు. అటు కాటన్ అసోసియేషన్ పత్తి కొనుగోలుదారులు రాష్ట్ర ప్రభుత్వంతో తమ డిమాండ్లను సఫలం చేసుకోవడం ఇటు పత్తి కొనుగోలు నిలిపివేస్తూ మధ్యాహ్నం మళ్లీ కొనుగోలు ప్రారంభించడం పట్ల అమ్మటానికి వచ్చిన పత్తి రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

CCI cotton purchase stalled in Madnoor..!

More articles

Latest article