మద్నూర్  లో నిలిచిపోయిన సీసీఐ పత్తి కొనుగోలు..!

బతుకమ్మ, మద్నూర్:  రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా సిసిఐ నిబంధనలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోలుదారులు సోమవారం పత్తి కొనుగోళ్ళను నిలిపివేయడంతో మద్నూర్ మార్కెట్ పరిధిలో సీసీఐ ఎల్ 01, ఎల్ 02, ఎల్ 03, మిల్లులకు కఠిన నిబంధనల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ కాటన్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో పత్తి వ్యాపారులు సిసిఐ కొనుగోలు ప్రైవేట్ కొనుగోళ్ళను నిరవధికంగా నిలిపివేశారు. దీనితో మద్నూర్ మార్కెట్ కు అమ్మటానికి వచ్చిన పత్తి వాహన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ కొనుగోలు వెంటనే ప్రారంభించాలని...