25.8 C
Hyderabad

ఐదు కోట్ల లంచం తీసుకున్న సిఐను అరెస్టు చేసిన సిబిసిఐడి పోలీసులు

CBCID police arrested a CI who accepted a bribe of ₹5 crore.

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

లక్ష, రెండు లక్షలు, కోటి రూపాయలు కాదు.. ఏకంగా ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకున్న ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ను సిబిసిఐడి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సుకుమార్ అనే డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఈ భారీ లంచం తీసుకున్నట్టు ఆధారాలు ఉండటంతో జైలుకు పంపారు. ఒక మందుల తయారీ సంస్థ భాగస్తుల మధ్య విభేదాలు రావడంతో దాని పరిష్కారం కోసం అంటూ ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు. ఈ సంఘటన తంజావూర్ లో జరిగింది. అందులో ఓ వాటా దారుడు సిఐ పై ఫిర్యాదు చేయడంతో సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి  మూడు కోట్ల 25 లక్షల రూపాయలు తాను నగదుగా ఇచ్చానని, మిగిలిన ఒక కోటి 75 లక్షలు నగదుగా ఇచ్చానని చెప్పాడు. సుకుమార్ ఇంటిపై దాడి చేసిన సిబిసిఐడి అధికారులకు లంచం తీసుకున్నట్టు ఆధారాలు లభించడంతో ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

More articles

Latest article