34.1 C
Hyderabad

స్నేహితుడి ప్రాణాలు తీసిన సెల్ ఫోన్

Cell phone claims a friend's life.

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  

 

నిజామాబాద్ నగరంలోని  3వ పోలీస్ స్టేషన్ పరిధిలో న్యూ ఎన్జీవోస్ కాలనీ  ప్రాంతంలో సెల్‌ఫోన్ విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ హరీష్  తెలిపిన వివరాల ప్రకారం ఈ  నెల 8న తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో గంగోని వినోద్, అతని స్నేహితుడు జయంత్ మద్యం మత్తులో ఉండగా సెల్‌ఫోన్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో జయంత్ బండరాయితో గంగోని వినోద్ తలపై కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాయపడిన వినోద్‌ను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి వినోద్ మృతి చెందాడు.ఈ ఘటనకు సంబంధించి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది అని  ఎస్ఐ తెలిపారు .

More articles

Latest article