25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణలో కులగణన పంచాయితీ

Must read

📰 Generate e-Paper Clip

. పెద్ద కులం వ్యక్తి అని కేసీఆర్ ను సీఎం చేయలేదు.. తెలంగాణ తెచ్చిండని ఓట్లేశారు

. ఆయన పిల్లల గుణం బాగోలేదని తరువాత ఓడించారు

. రాష్ర్ట ప్రభుత్వం చేయించిన కుల గణన సర్వే సరిగా లేదు

. అవి తప్పుడు లెక్కలని గంటల్లో నిరూపిస్తా

. ఎంపీ ధర్మపురి అర్వింద్

న్యూఢిల్లీ, బతుకమ్మ: రాష్ఱ్ట ప్రభుత్వం చేయించిన కులగణన అదో సర్వే కాదు, మన్నూ కాదని.. తెలంగాణలో కులగణన పంచాయితీ ఎక్కువైందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. న్యూఢిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కులం పెద్దదని ఆయనను సీఎం చేయలేదని, తెలంగాణ కోసం కొట్లాడారని ప్రజలు ఆయనకు ఓట్లేశారని అన్నారు. ఆయన పదేళ్ల పాలన, ఆయన పిల్లల గుణం బాగోలేదనే ఆ తరువాత ప్రజలు ఓడించారన్నారు. రాజకీయాల్లో కులం కన్నా గుణం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎక్కడ కులం పంచాయితీ ఉన్నా.. బీజేపీలో మాత్రం ఉండకూడదని అన్నారు. పార్టీలో ఎవరైనా కులం గురించి మాట్లాడితే బీజేపీ అధిష్టానం సహించొద్దని అన్నారు. రాష్ర్ట ప్రభుత్వం కులాల వారీగా నంబర్లను అధికారికంగా విడుదల చేయకముందే లీకులు ఇస్తోందని ఆరోపించారు. సీఎం  రేవంత్ రెడ్డి లీకులు ఇస్తున్నారా? లేక కాంగ్రెస్ తో కలిసి కేసీఆర్ లీకులు చేయిస్తున్నారా? అని ప్రశ్నించారు. వారు ఇస్తున్న లీకుల బుట్టలో బీజేపీ వాళ్లు పడుతున్నారని, తెలిసి పడుతున్నారా? లేక తెలియక పడుతున్నారా? అని అన్నారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కులగణన నంబర్లను అధికారికంగా ప్రకటించాలని అర్వింద్ డిమాండ్ చేశారు. నంబర్లను విడుదల చేస్తే అవి తప్పని తాను గంటల్లో నిరూపిస్తానని అన్నారు. రాష్ర్టంలో అసలు క్రిస్టియన్ లే లేరా? అని అర్వింద్ ప్రశ్నించారు. సీఎం చెప్పిన ప్రకారం రాష్ర్ట జనాభా 3,54,75,554 కాగా, ఓటర్లు 3,35,27,925 మంది ఉన్నారన్నారు. వారి లెక్కల ప్రకారమే సుమారు 19 నుంచి 20లక్షల మంది నాన్ ఓటర్లు ఉన్నారని, ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ప్రకారం 0 నుంచి 6  ఏళ్ల వయస్సు వారు 39 లక్షల మంది  ఉన్నారని అర్వింద్ విమర్శించారు.

More articles

Latest article