బతుకమ్మ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున పాడుబడ్డ రైస్ మిల్ గోడ కూలీ తండ్రి కూతుర్లు మృతి చెందిన ఘటనలో రైస్ మిల్ యజమానులపై కేసు నమోదు అయినట్లు స్థానిక ఎస్సై సునీల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండల కేంద్రంలోని మాలివాడకు చెందిన ఇందూర్ మహేష్ (25) తన భార్య మహేశ్వరి రెండు నెలల కూతురు గౌతమితో కలసి తన ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున ఇంటి పక్కన ఉన్న సాయిబాబా రైస్ మిల్ యొక్క గోడ కూలి వారి యొక్క ఇంటి మీద పడడంతో మట్టి పెల్లలు మహేష్ యొక్క తల, చాతి మీద పడడం వలన మహేష్ తో పాటు అతని కూతురు గౌతమి మీద మట్టి పెల్లలు పడడంతో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందాగా మహేష్ భార్య మహేశ్వరికి గాయాలయ్యాయని ఆయన తెలిపారు . శిథిలావస్థలో ఉన్న సాయిబాబా రైస్ మిల్ కూలి పోయే ప్రమాదం ఉందని తెలిసి కూడా మరమ్మత్తులు చేయించకుండా నిర్లక్ష్యం వహించిన కతేవర్ విట్టల్ రావు, లక్ష్మీకాంత్, కృష్ణ, నాగేశ్వరరావు, రామ్ కుమార్ అను రైస్ మిల్ యజమానులపై మృతుల బంధువులు ఇందూర్ సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.