ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయిలో ” స్వస్త్ నారీ ససక్త్ పరివార్ అభియాన్ ” ‘ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం’ కార్యక్రమం కింద మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది.ఈ శిబిరంలో స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణురాలు డాక్టర్ రమ్య, జనరల్ మెడిసిన్ డాక్టర్ స్నేహ, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అమీనా,జనరల్ సర్జన్ డాక్టర్ అక్షయ్,కంటి వైద్య నిపుణులు డాక్టర్ స్రవంతి, చెవి ముక్కు గొంతు నిపుణులు సయ్యద్ నిడ ఆయేషా ఖాద్రి, చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ ప్రియాంత్, మానసిక వ్యాధి నిపుణులు డాక్టర్ రాజేందర్, దంత వైద్య నిపుణులు డాక్టర్ శశిధర్ పాల్గొన్నారు.ఉచిత శిబిరంలో 158 మంది రోగులు పరీక్షించుకున్నారు. అందులో అధికంగా స్త్రీ వైద్య నిపుణులు జనరల్ మెడిసిన్ కు రోగులు అధికంగా చికిత్స పొందారు.కొంతమందిని పై ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగింది. 22 మందికి ఉచిత రక్త పరీక్ష నిర్వహించడం జరిగింది.ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ షారోన్ షైని క్రిస్టినా తెలిపారు.ఉచిత ఆరోగ్య శిబిరంలో ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్ అలీ దేవపాలెం ఎం.ఎల్.ఎచ్.పి.లు కీర్తన మలేహ సుచరిత ల్యాబ్ టెక్నీషియన్ అనిత రాథోడ్,ఫార్మసిస్ట్ విజయలక్ష్మి,స్టాఫ్ నర్స్ గంగమణి ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.