- నిజామాబాద్ జిల్లాలో మొదటి ఇందిరమ్మ నిర్మాణం పూర్తి,
మాక్లూర్, బతుకమ్మ: మాక్లుర్ మండలంలోని ముల్లంగి గ్రామంలో జిల్లా వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమాన్ని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని మొదటి ఇందిరమ్మ గృహ నిర్మాణాన్ని పూర్తిచేసిన లబ్బిదారులైన మేడి మౌనిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆవాసం లేని మా కుటుంబానికి నివాసం అందించడం నాకు చాలా ఆనందంగా ఉందని, గత ప్రభుత్వమైన టిఆర్ఎస్ హయాంలో నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ కోసం పలుమార్లు అప్లికేషన్ చేసిన కానీ రాలేదు, మాకు సరైన నివాసం లేకుండా వర్షాకాలం వచ్చిందంటే చాలు బిక్కుబిక్కుమంటూ గడిపేవారిమని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రారంభించిన పథకాన్ని మేము అప్లికేషన్ చేసిన వెంటనే అర్హులుగా ప్రకటించి మాకు నివాసాన్ని కల్పించిన కాంగ్రెస్ సర్కార్ కి సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో మొదటిసారిగా ఇంద్రరమ్మ నివాసాన్ని పూర్తి చేయడంలో సహాయ సహకారాలు అందించిన మాక్లుర్ కాంగ్రెస్ నాయకులకు నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డికి ప్రత్యేకంగా జీవితకాలం రుణపడి ఉంటామని తెలిపారు. తన పుట్టినరోజు పురస్కరించుకొని వినయ్ రెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని మొదటిసారిగా ఆర్మూర్ నియోజకవర్గంలో ఇంద్రరమ్మ గృహ నిర్మాణాన్ని పూర్తిచేసి గృహప్రవేశం చేయడం కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వారన్నారు. గత ప్రభుత్వం టిఆర్ఎస్ పేదలకు డబల్ బెడ్రూంల పేరుతో కాలయాపన చేస్తూ కాలం వెళ్లదీసి కల్వకుంట్ల కుటుంబం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోట్లు కూడబెట్టుకున్నారని తెలిపారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఏ ఒక్క డబుల్ బెడ్రూం నిర్మించిన దాఖలాలు లేవని వారన్నారు. పేదలకు సంక్షేమ పథకాల పేరుతో అనేక అక్రమాలు చేశారని వారు తెలిపారు.ప్రస్తుత ఎమ్మెల్యె ఎలక్షన్లకు ముందు ప్రతి గ్రామంలో తన సొంత డబ్బులతో పేదలకు ఇల్లు నిర్మిస్తానని చెప్పి ఏ ఒక్క ఇంటికి కూడా కనీసం దర్వాజా సహాయం చేయని వ్యక్తి మాయ మాటలతో ఎమ్మెల్యేగా గెలిచి వెళ్లదీస్తున్నాడు కచ్చితంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తారని తెలిపారు. మాక్లుర్ మండలంలోని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న ముల్లంగి గ్రామంలో 94 మంది లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందని ఇప్పటికే 34 ఇందిరమ్మ గృహములు పూర్తి కానున్నాయని వారు తెలిపారు. రెండో దశలో మరింత మందికి ఇంద్రమ్మ గృహాలను మంజూరు చేయడం జరుగుతుందని, వచ్చే ఎలక్షన్ నాటికి ఆర్మూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ నివాసం లేని పేదవాడు ఉండకూడదని వారన్నారు.ప్రతి నిరుపేద వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎప్పటికప్పుడు ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి గురించి జిల్లా నాయకులు తెలిపి సీఎం రేవంత్ రెడ్డితో అభివృద్ధి పనులు మంజూరు చేస్తున్నానని వారు వివరించారు. ఇంద్రరమ్మ ఇల్లు నిర్మాణాన్ని పూర్తిచేసి గృహప్రవేశానికి పిలిచిన మౌనిక మరియు సునీల్ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినయ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి ప్రకాష్, సొసైటీ చైర్మన్ అశోక్, వెంకటేష్,గంగాధర్ గౌడ్,దయాకర్ రావు వీర్ సింగ్ ,వినోద్,సురేష్,భరత్, విట్టల్, సురేష్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

