27.5 C
Hyderabad
Friday, July 31, 2026

యూఎస్పీసీ, జాక్టో నాయకులపై పెట్టిన కేసు కొట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ మొదటి పీఆర్సీ నివేదిక విడుదల చేయాలని, బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని కోరుతూ  డిసెంబర్ 29, 2020 న యుఎస్పీసి, జాక్టో లు సంయుక్తంగా హైదరాబాద్ ఇందిరా  పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నా సందర్భంగా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు చావ రవి(యూటీఎఫ్) టి. లింగారెడ్డి(డీటీఎఫ్), జి సదానందం గౌడ్ (ఎస్టీయూ)లపై బనాయించిన అక్రమ కేసులో  సికిందరాబాద్ సిటీ సివిల్ కోర్టు అక్రమ కేసుగా పరిగణించి కేసును కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. నాయకులు నాలుగేళ్లుగా కోర్టు చుట్టూ తిరగారు. నాలుగేళ్లకు తుది తీర్పు వెలువడింది. ఉద్యోగులకు హక్కుగా రావలసిన పిఆర్సి, పదోన్నతులు, బదిలీలు నిరాకరించి దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలను పరిష్కరించనందున దశల వారి పోరాట కార్యక్రమంలో భాగంగా వేలాది మందితో ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించిన సందర్భంగా ప్రభుత్వం సమస్యలపై అనుచివేత వైఖరితో ముగ్గురు నాయకుల పై అక్రమ కేసులు పెట్టారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాల ద్వారా సమస్యలు పరిష్కరించుకునే హక్కు ఉద్యోగులకుంటుందని, విధి లేని పరిస్థితుల్లోనే ఉద్యమాలకు పిలుపునివ్వడం తప్పు కాదని కోర్టు భావించి కేసు కొట్టి వేసింది.

More articles

Latest article