యూఎస్పీసీ, జాక్టో నాయకులపై పెట్టిన కేసు కొట్టివేత

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ మొదటి పీఆర్సీ నివేదిక విడుదల చేయాలని, బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని కోరుతూ  డిసెంబర్ 29, 2020 న యుఎస్పీసి, జాక్టో లు సంయుక్తంగా హైదరాబాద్ ఇందిరా  పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నా సందర్భంగా అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా ఉపాధ్యాయ సంఘ నాయకులు చావ రవి(యూటీఎఫ్) టి. లింగారెడ్డి(డీటీఎఫ్), జి సదానందం గౌడ్ (ఎస్టీయూ)లపై బనాయించిన అక్రమ కేసులో  సికిందరాబాద్ సిటీ సివిల్ కోర్టు అక్రమ కేసుగా పరిగణించి కేసును కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. నాయకులు...