27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆపరేషన్ సిందూర్ కు  కాంగ్రెస్ నేతల సంఘీభావ ర్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిబతుకమ్మ: టీపీసీసీ అధ్యక్షులు  మహేష్ కుమార్ గౌడ్  సందేశం మేరకు, ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసన సభ్యులు మదన్ మోహన్  ఆదేశాల ప్రకారం, గురువారం ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో “ఆపరేషన్ సిందూర్” సైనికులకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ గారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే మన సైనికుల పట్ల సంఘీభావం తెలిపే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేపట్టాం. ‘ఆపరేషన్ సిందూర్’ కార్యక్రమం ద్వారా దేశభక్తిని ప్రేరేపిస్తూ, ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఈ సంఘీభావ కార్యక్రమంలో యువత, పార్టీ కార్యకర్తలు, ప్రజలు చురుకుగా పాల్గొనడం హర్షణీయం” అని అన్నారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.

More articles

Latest article