29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

సౌమ్య మృతికి సంతాపంగా కొవ్వొత్తుల శ్యాంతి ర్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

గత నెల 23 న గంజాయి స్మగ్లర్ల అమానుష దాడిలో తీవ్రంగా గాయపడి, నిమ్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస వదిలిన, ఎక్సైజ్ మహిళ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య కి సంతాప సూచకంగా , కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. టీఎన్జీవో ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన, సోమవారం టీఎన్జీవో జిల్లా కార్యాలయం నుండి ఎన్టీఆర్ చౌరస్తా, కోర్టు చౌరస్తా మీదుగా నగరంలోని ప్రధాన కూడలీల గుండా అమర్ రహే… గాజుల సౌమ్య.. అమర్ రహే…. అంటూ నినాదాలు చేశారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సుమన్ కుమార్ మాట్లాడుతూ ధీరవనిత కుమారి గాజుల సౌమ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ, టీఎన్జీవో సంఘం వారి కుటుంబానికి అండగా ఉంటుందని, దాడికి పాల్పడిన దోషులను చట్టరీత్యా వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, టీఎన్జీవో కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, మచ్చుకూరి సతీష్, జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అతీక్అహ్మద్, కేపీ సునీత, మంజుల, జాఫర్ హుస్సేన్, మాణిక్యం, పురుషోత్తం, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, వివిధ యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు జ్ఞానేశ్వర్, సృజన్ కుమార్, సూర్య ప్రకాష్, విశాల్, నాగేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, క్లాస్ ఫోర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, అన్ని శాఖల ఉద్యోగులు, మహిళా ఉద్యోగ సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరై, ఆ వీరవనితకు ఘనంగా నివాళులు అర్పించారు.

More articles

Latest article