నిజామాబాద్, బతుకమ్మ : క్యాన్సర్ పై అవగాహన పెంచేందుకు వెల్నెస్ హాస్పిటల్స్, ఇండోర్ క్యాన్సర్ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని పుల్లాంగ్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. జెండా ఊపి ఈర్యాలీని వెల్నెస్ ఆస్పత్రి ఎండీ సుమన్ గౌడ్ ప్రారంభించారు. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, యుబి హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు, మెడికల్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యులు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి వెల్నెస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతతో ఈ ర్యాలీ నిర్వహించామన్నారు. క్యాన్సర్ ను మొదటి దశలోనే గుర్తిస్తే అరికట్ట వచ్చని పేర్కొన్నారు. అలాగే వెల్నెస్ హాస్పిటల్ కు వైద్యం కోసం వచ్చే ప్రజలకు ఆస్ప త్రి యాజమాన్యం తరపున రూ. 50,000 వేల విలువ గల ఉచిత ఫ్యామిలీ హెల్త్ కార్డును అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆధార్ కార్డు ఆస్పత్రిలో చూపిస్తే ఉచిత హెల్త్ కార్డు ఇస్తారని తెలిపారు. భవిష్యత్తులో కూడా వెల్నెస్ ఆస్పత్రి ప్రజలకు అందుబాటులో ఉంటూ ముఖ్యంగా నిరుపేదలకు మెరుగైన వైద్య అందించడంతో పాటు వారి చికిత్సలో రాయితీని అందిస్తుందన్నారు. కార్యక్రమంలోఆస్పత్రి వైస్ ప్రెసిడెంట్ బోదు అశోక్, ఆస్పత్రి వైద్యులు పొద్దుటూరి కౌశిక్, నాగ నాయక్, ప్రశాంత్ రెడ్డి, కిరణ్ కేతావత్, ఆసుపత్రి జనరల్ మేనేజర్ అరవింద్, లతోపాటు వెల్నెస్ ఆస్పత్రి సిబ్బంది, ఇందూర్ ఆస్పత్రి హెడ్ డాక్టర్ అమర దీపిక, డాక్టర్ అరవింద్, డాక్టర్ చైతన్య, యువి హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ నిర్వాహకులు సృజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
