నిజామాబాద్, బతుకమ్మ : సంత్ శిరోమణి సద్గురు శ్రీ నాందేవ్ మహరాజ్ అడుగుజాడలో ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే ధన్ పా ల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం వినాయక్ నగర్లోని మహా వీరుల ప్రాంగణంలో నిర్వహించిన సంత్ శిరోమణి సద్గురు శ్రీ నాందేవ్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాందేవ్ మహారాజ్ గారు 700 సంవత్సరాల క్రితమే మేరు కులస్తుల ఐక్యత కోసం పోరాడిన మహనీయుడన్నారు. ఆయన బోధనలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణనిస్తాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మేరు కులస్తులు విగ్రహ ప్రతిష్ఠాపన పాల్గొనడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో పోల్కం గంగాకిషన్ , బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి,ఈశ్వర్ నామ్ దేవ్ రావు, జిల్లా మేరు సంఘం సోమ హన్మంతరావు అధ్యక్షులు, కొట్టూరు దేవదాస్- ప్రధాన కార్యదర్శి, కొట్టూరు చంద్రకాంత్ కోశాధికారి,నగర మేరు సంఘం, మంతెన దశరత్ – అధ్యక్షులు,దర్శస్తు గంగాధర్ – ప్రధాన కార్యదర్శి, యెన్ను సుదర్శన్ – కోశాధికారి మేరు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

